18 May 2024
TV9 Telugu
Pic credit - Pexels
కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పి భరించలేనిది. అసమతుల్య ఆహారం, సరైన జీవనశైలి పాటించని కారణంగా ఇప్పుడు యువకులలో కూడా కీళ్లవాతం సమస్య కనిపిస్తుంది.
ఆర్థరైటిస్‌లో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డైటీషియన్ మోహిని డోంగ్రే చెబుతున్నారు. ఆర్థరైటిస్ ను నివారించే కొన్ని ఆహారాలను తినే ఆహరంలో తప్పకుండా చేర్చుకోండి.
ఆర్థరైటిస్ సమస్యలో శరీరంలో యూరిక్ యాసిడ్ నిర్వహించడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో అవిసె గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఆర్థరైటిస్‌లో ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉన్న పండ్లు, సీజనల్ పండ్లు, ఉసిరికాయ, నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
ఆర్థరైటిస్ బాధితులు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. ఇది శరీరంలోని కాల్షియం లోపాన్ని తీరుస్తుంది. ఎముకల నొప్పి నుంచి ఉపశమనం కలిస్తుంది.
కీళ్లనొప్పుల సమస్య పెరగకుండా ఉండాలంటే బీన్స్, ఆకుకూరలు, మెంతికూర, క్యాబేజీ, పప్పులు, బ్రకోలీ వంటివి తినే ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం ఇస్తాయి.
ఎవరైనా ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. ఉప్పు, బంగాళదుంపలు, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరను ఎక్కువగా తినవద్దు. దీంతో కీళ్లనొప్పులు పెరగవచ్చు