డెంగ్యూ దోమ కుట్టిన ఎన్ని రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయంటే..

26 September 2023

డెంగ్యూ అనేది దోమ కాటు వల్ల కలిగే ప్రమాదకరమైన వైరల్ వ్యాధి.. ఇది భారతదేశంలో వేగంగా వ్యాపిస్తోంది. వర్షాకాలంలో దోమల బెడద పెరగడం వల్ల డెంగ్యూ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 

డెంగ్యూ వైరస్‌లో 4 జాతులు ఉన్నాయి, ఇది ఏడిస్ ఈజిప్టి దోమ ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పి, వాంతులు, విరేచనాలు మరియు రక్తస్రావం.

డెంగ్యూ రాకుండా ఉండాలంటే దోమల వృద్ధిని అరికట్టడం. దోమతెరలు వాడడం, శరీరాన్ని కప్పి ఉంచుకోవడం చాలా ముఖ్యం. 

డెంగ్యూ లక్షణాలు సాధారణంగా ఏడిస్ దోమ కుట్టిన 3 నుండి 14 రోజుల మధ్య కనిపిస్తాయి. దోమ కాటు తర్వాత లక్షణాలు కనిపించడానికి సగటు సమయం 4 నుండి 7 రోజులు పడుతుంది.

అయితే ఇది వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. కొంతమందిలో డెంగ్యూ లక్షణాలు 3 నుండి 4 రోజులలో వేగంగా కనిపిస్తాయి. మరికొందరిలో డెంగ్యూ లక్షణాలు క్రమంగా పెరుగుతాయి. 

2 వారాల వరకు డెంగ్యూ లక్షణాలు, జ్వరం ఉంటుంది. లక్షణాలు కనిపించే సమయం వ్యక్తి  రోగనిరోధక శక్తిపై ఆధారపడి ఉంటుంది.

దోమ కాటు తర్వాత మీ ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఏదైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. 

డెంగ్యూ వ్యాధి సోకిన ఆడ ఏడిస్ దోమ కుట్టిన 3-14 రోజులలోపు లక్షణాలు కనిపిస్తాయి. చిగుళ్ళలో రక్తస్రావం, ముక్కు నుంచి రక్తం కారడం లేదా సులభంగా గాయపడటం వంటి తేలికపాటి రక్తస్రావం.