డెంగ్యూ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?

12 August 2023

డెంగ్యూ అనేది వైరల్ ఫీవర్. డెంగ్యూ కారణంగా, శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుంది.  దాని కారణంగా శరీరం బలహీనంగా మారుతుంది. మనిషి కనీసం కదలలేని పరిస్థితి ఏర్పడవచ్చు.

డెంగ్యూ

డెంగ్యూ ప్రాణాంతకం అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితి విషమించడం వలన ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది.

డెంగ్యూ

డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం ఎవరికి ఉంటుంది? ఎవరు ఎక్కువ ప్రమాదంలో చిక్కుకుంటారు? డాక్టర్స్ ఏం చెబుతున్నారు. 

డెంగ్యూ

మధుమేహ వ్యాధిగ్రస్తులకు డెంగ్యూ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అది ఆరోగ్యానికి హాని చేస్తుంది.

మధుమేహం

క్షయ రోగులు కూడా డెంగ్యూ భారిన పడే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం కూడా అవుతుంది. క్షయ రోగులు డెంగ్యూ కారణంగా చాలా ప్రభావితం అవుతారు.

టీబీ

డెంగ్యూ వ్యాధి బారిన పడే ప్రమాదం వృద్ధులు, పిల్లలకు ఎక్కువగా ఉంటుంది.  వృద్ధులకు బీపీ సమస్య రావచ్చు. పిల్లలు డెంగ్యూ కారణంగా మరింత ఇబ్బందులకు గురవుతారు.

వృద్ధులు

డెంగ్యూ రోగులు యాంటీబయాటిక్స్ వాడకూడదు. అది వారి పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. వైద్యుల సూచనల మేరకే మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది.

మందులు

డెంగ్యూ బారిన పడిన వారిలో ప్లేట్‌లెట్స్ పడిపోవడం కారణంగా నిస్సత్తువగా ఉంటారు. వైద్యుల సలహా మేరకు ట్రీట్‌మెంట్ తీసుకోవడంతో పాటు, ఆహారం తీసుకోవాలి.

డెంగ్యూ