నేచురల్ దగ్గు సిరప్‌ను ఇంట్లో తయారు చేసుకోండి..

వర్షాకాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, జ్వరం వేధిస్తాయి.

దగ్గు సిరప్‌లు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి.

ఇంట్లోని మూలికలతో నేచురల్ సిరప్‌ను తయారు చేయొచ్చు.

అల్లం, తులసి, తేనె, నిమ్మకాయ, నల్ల మిరియాలతో ఈ సిరప్ తయారు చేయొచ్చు.

ముందు పేర్కొన్న పదార్థాలన్నింటినీ నీటిలో వేసి బాగా మరిగించాలి.

ఆ తరువాత నీటిని కిందకు దించి చల్లారిన తరువాత గాజు పాత్రలో పోయాలి.

చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.

దగ్గు తగ్గేందుకు రోజుకు రెండుసార్లు ఒక స్పూన్ తాగాలి.

దగ్గు రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే వైద్యుడికి చూపించుకోవాలి.