మల్బరీ తినడం వల్ల ఆరోగ్యం పదిలం..
16 August 2023
ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. వారంలో నాలుగు సార్లు ఈ పండును తీసుకుంటే కంటిచూపు పెరుగుతుంది.
వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మధుమేహాన్ని తగ్గించడంలో ఈ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి.
ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్ లను అడ్డుకుంటుంది. కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తుంది.
మల్బరీ వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. చర్మం మీద ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
మల్బరీ పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ హెపాటిక్ లిపోజెనిసిస్ ను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ స్ధాయిలను నిరోధించటంలో ఈ పండ్లు ఉపకరిస్తాయి.
దీనిని ఆహారంలో చేర్చుకోవటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్ధాయిలు తగ్గి డయాబెటిస్ వల్ల వచ్చే బరువును నియంత్రించటంలో మల్బరీ ఉపయోగపడుతుంది.
జీర్ణవ్యవస్ధ మెరుగుపరిచేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. మలబద్దకం, ఉబ్బరం, గ్యాస్, తిమ్మిరి వంటి వాటిని నివారిస్తాయి.
మల్బరీ పండ్లలో ఐరన్ సమృద్దిగా ఉండటం వల్ల ఎర్రరక్త కణాల పెరుగుదల,శరీర కణాలకు వేగంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి