గుండెకు గుబులు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు!

25 September 2024

TV9 Telugu

TV9 Telugu

చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతోమందిని కబళిస్తున్న అతిపెద్ద సమస్య గుండెపోటు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇది మనదేశంలో పదేళ్ల ముందుగానే దాడి చేస్తోంది

TV9 Telugu

గుండెపోటు హఠాత్తుగా సంభవించేదే కావొచ్చు. కానీ దీనికి చాలాకాలం ముందే.. పసిగట్టొచ్చు. ఇందుకు తేలికైన మార్గాలు లేకపోలేదు. కొద్దిపాటి అప్రమత్తతో వీటిని ముందే గుర్తించొచ్చు

TV9 Telugu

నిజానికి, గుండెపోటుకు అనేక కారణాలు ఉండవచ్చు. చాలా మంది గుండెపోటుకు ఛాతీ నొప్పి మాత్రమే లక్షణమని భావిస్తారు. అది నిజం కాదు. గుండెపోటు రాకముందే మన శరీరం వివిధ భాగాలలో ఎన్నో హెచ్చరికలు ఇస్తుంది

TV9 Telugu

ఛాతీ నొప్పి కాకుండా, మెడ, దవడ మరియు భుజం ప్రాంతంలో నొప్పి అనుభూతి చెందుతుంది. ఎడమ చేతిలో నిరంతరం నొప్పి ఉంటే వెంటనే అప్రమత్తం కావాలి. ఇది గుండెపోటు లక్షణాలలో ఒకటి

TV9 Telugu

కొందరిలో వెన్నునొప్పి ద్వారా గుండెపోటు లక్షణాలు కనిపిస్తాయి. కానీ చాలా మంది దీనిని అలసటగా తప్పుగా భావిస్తుంటారు. అలాగే ఎగువ పొత్తికడుపు నొప్పి, వికారం లేదా వాంతులు కూడా గుండెపోటుకు సంకేతమే

TV9 Telugu

గుండెనొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారిన వెంటనే అప్రమత్తం కావాలి. రక్తం సరఫరా తగ్గినట్లయితే గుండెలో మంటగా ఉంటుంది

TV9 Telugu

తరచుగా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్నా.. అవి ఎంతకీ తగ్గకపోయినా గుండె నొప్పికి సూచనలుగానే భావించాలి.  గుండె భారంగా.. అసౌకర్యంగా అనిపిస్తుంటుంది

TV9 Telugu

మత్తుగా లేదా మగతగా ఉన్నా, చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండె నొప్పికి సూచనలుగా అనుమానించాలి. తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు వస్తున్నా అశ్రద్ధ చేయకూడదు. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి