Taro Root Photo

చేమ దుంపలతో ఈ  అనారోగ్య సమస్యలకు చెక్..

12 August 2023

Taro Root Slices

చేమ దుంపను మనదేశంలో ముఖ్యంగా కోస్తా భారతదేశంలోని గోవా, కర్నాటక , మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

Taro Root Pieces

వీటితో వడలు, ఫోడి వంటి వంటకాలు చేస్తే.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్రై, పులుసు వంటి కూరలను చేస్తారు. ఒక ఒడిశాలో చేమ దుంప పప్పుతో చేసిన ప్రసిద్ధ వంటకం సారు బెసర.

Taro Root Picture

అంతేకాదు చేమ దుంప వేర్లు కూడా నూనెలో బాగా వేయించి, ఎర్ర మిరప పొడి , ఉప్పు చల్లి సారు చిప్స్‌ను తయారుచేస్తారు.

చేమ దుంపల్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం , విటమిన్లు సి , విటమిన్ ఇ లు అధికం. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చేమ దుంప పిండి పదార్ధమైన కూరగాయ అయినప్పటికీ, ఇది రక్తంలో చక్కెర నియంత్రణ చేసే రెండు రకాల కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది.

ఫైబర్ , ఇతర కార్బోహైడ్రేట్లు..  జీర్ణక్రియ, శోషణను నెమ్మదిస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది.

చేమ దుంపలో డయటరీ ఫైబర్‌ ఉండడం వల్ల ఇది నెమ్మదిగా జీర్ణం అవుతూ, రక్తప్రవాహం లోకి గ్లూకోజ్ ని నిదానంగా విడుదల చేస్తుంది.

దీనివల్ల ఎక్కువసేపు శరీరములో చాలినంత శక్తి ఉంటుంది. బరువు తగ్గడములో సహకరిస్తుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో  ప్రోటీన్లు  కొద్దిగానే ఉంటాయి.