వాల్‌నట్‌ షెల్‌తో చర్మ  సమస్యలకు చెక్.. 

01 September 2023

రోజువారీ జీవితంలో చాలా వాల్‌నట్‌లను తింటూ ఉంటారు. వాల్‌నట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే అవి మిమ్మల్ని తాజాగా ఉంచుతాయని మనందరికీ తెలుసు.

వాల్ నట్స్ లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని మృదువుగా మార్చుతాయి.

ఇది మన చర్మాన్ని కూడా పునరుజ్జీవింపజేస్తుంది. చర్మానికి వాల్‌నట్‌ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

వాల్ నట్ షెల్ చర్మాన్ని చాలా మృదువుగా చేస్తాయి. ప్రతి ఒక్కరూ తమ ముఖం మెరిసిపోవాలని కోరుకుంటే పొడి చర్మం నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.

మీరు వాల్‌నట్ షెల్స్‌తో ఫేస్ ప్యాక్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇది మీ ముఖంపై మురికి వల్ల ఏర్పడిన మరకలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.

జిడ్డు చర్మం ఉన్నవారికి వాల్‌నట్ షెల్స్‌ చాలా మేలు చేస్తాయి. మీరు వాల్‌నట్ షెల్స్‌ పొడి చేసి మీ చర్మంపై అప్లై చేయవచ్చు. ఇది చర్మంపై కణాలను తొలగిస్తుంది.

ఈ వాల్‌నట్ షెల్స్‌ పొడిని  సున్ని పిండిని రాసినట్లుగానే రాస్తే సరిపోతుంది. జిడ్డు చర్మం పోగొట్టి మెరిసేలా చేస్తుంది.

వాటిని మెత్తగా దంచి మొఖంపై రాయండి. మోహంపై వచ్చే మచ్చల నుంచి మంచి ఉపశమనం ఇచ్చి చర్మానికి మెరుపును తీసుకురావడంలో సహాయపడుతుంది.