ఈ పండ్లతో మధుమేహ సమస్యకు చెక్.. 

16 August 2023

రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయమో అని పండ్లు తినడం మానేస్తున్నారు డయాబెటిస్‌ రోగులు. ఇది కొంతవరకే నిజం.

పండ్లలోని ఫైబర్‌, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి పోషకాలను అందించడమే కాక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

పండ్లలో ఫ్రక్టోస్‌ అనే సహజమైన చక్కెర కారణంగా ఏ పండ్లు తింటే రక్తంలో చక్కెర పెరగదో అవి మాత్రమే తీసుకోవాలి.

మధుమేహం సమస్య ఉన్నవారు యాపిల్‌, జామ, నారింజ, బొప్పాయి, కర్బూజ వంటి ఐదు రకాల పండ్లు నిరభ్యంతరంగా తినొచ్చు.

వీటిలో తక్కువ కొవ్వు, కెలోరీలు, సోడియంతో పాటు ఫోలేట్‌, విటమిన్‌-సి, పొటాషియం, డైటరీ ఫైబర్‌ లాంటి పోషకాలు చాల ఉన్నాయి.

వీటిలో ఉన్న పొటాషియం రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది. ఫోలేట్‌ ఎక్కువగా లభించే ఈ పండ్లు ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతాయి.

ఈ పండ్లలో  విటమిన్‌ సి శరీరంలో కణజాలం పెరుగుదలకు, మరమ్మతుకు, గాయాలు మానడానికి, దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

పండ్లరసాల కంటే తాజా పండ్లే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. రసాలతో పోలిస్తే పండ్లలో కెలోరీలు తక్కువగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గి గుండె రోగాల ముప్పు తగ్గుతుంది.