ఈ పండ్లతో గుండె సమస్యలకు చెక్..

13 August 2023

శరీరంలో చాలా ముఖ్యమైన భాగం గుండె. ఇది జీవితం ప్రారంభం నాటి నుంచి చివరి శ్వాస వరకు కొట్టుకుంటూనే ఉంటుంది.

దీన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే.. గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

కొన్ని ఎల్లో ఫ్రూట్స్, కూరగాయలను తినడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ ఫ్రూట్స్, కూరగాయలు ఏంటో తెలుసుకోండి.

వేసవి కాలంలోనే దొరికే మామిడికాయ పేరు వినగానే చాలామంది నోట్లో నీరురూతుంది. రుచిగా ఉండే ఈ పండు గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అలాగే బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

అరటిపండును తినని వారు చాలామంది ఉంటారు. అరటిపండ్లను పరిమిత పరిమాణంలో తినడం వల్ల బరువు తగ్గడంతోపాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది

పైనాపిల్‌ కూడా ఆరోగ్యానికి చాలామంచిది. అయితే దీన్ని తినడం వల్ల గుండెపోటు రిస్క్ చాలా వరకు తగ్గుతుందని పేర్కొంటున్నారు.

క్యాప్సికమ్‌లో ఫైబర్, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉన్న కారణంగా శరీరానికి చాలా శక్తి లభిస్తుంది. అదే సమయంలో శరీరంలో రక్త హీనత, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.