సుఖాసనంతో ఆ సమస్యలకు చెక్..

21 August 2023

చాలా మందికి యోగా ఏ సమయంలో ఎక్కడ ఎలా చేయాలని సందేశం ఉంది. అయితే యోగాను ఏ సమయంలోనైనా చేయవచ్చు.

ఉదయం , సాయంత్రం కూడా చేయవచ్చు. అయితే సాయంత్రం చేస్తే .. మధ్యాహ్నం ఆహారం తింటాం కనుక కడుపు ఫుల్ గా ఉంది.

దీని వలన ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగాకి మించినది మరొకటి లేదు. ఈరోజు సుఖాసనం దాని ఉపయోగాలు తెలుసుకుందాం.

సుఖాసనం వేయడానికి చాపపై కూర్చోని కాళ్ళను తిన్నగా ముందుకు చాపాలి. తరువాత కాళ్ళను మడచి కూర్చోవాలి.

వెన్నుముక నిఠారుగా ఉండేలా చూడాలి. ఇలా సుఖంగా సౌకర్యంగా వెన్నె నిఠారుగా ఉంచి ఎంతసేపైనా ఈ ఆసనంలో ఉండవచ్చు.

అయితే భుజాలను చక్కగా స్తిఫ్ట్ గా ఉంచాలి. సౌకర్యంగా ఉన్నంత సేపూ ఈ భంగిమలో కూర్చోవచ్చు. ఇలా చేయడమే సుఖాసనం.

మనసుకి ప్రశాంత నిస్తుంది. శరీర కదలిక స్థితిని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ సజావుగా సాగేలా చూస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది.

వెన్నుకు శక్తి కలుగుతుంది. త్వరగా అలసట లేకుండా చేస్తుంది. శరీరం శక్తిని పుంజుకుంది అన్న భావన కలుగజేస్తుంది.