ఈ ఫుడ్స్‎తో బలహీనతకు చెక్.. 

10 December 2024

TV9 Telugu

విటమిన్ బి12 లేకపోవడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. డిప్రెషన్, ఆందోళన కూడా శరీరాన్ని బలహీనం చేస్తాయి.

ఏదో ఒక రకమైన వ్యాధి వల్ల కూడా ఇలా జరుగుతుందని అంటున్నారు. శరీరంలో బలహీనత ఉంటే ఆహారంలో వీటిని జోడించండి..

సీజనల్ పండ్లు, కూరగాయల్లో శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కారణంగా బలహీనత సమస్య దూరం అవుతుంది.

బలహీనతకు నీటి కొరత కూడా ఓ కారణం. పండ్లలో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ సమస్య ఉండదు.

శరీర బలహీనతను తొలగించడానికి లీన్ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

చేపలు, మాంసం, గుడ్లు వంటి వాటినలో లీన్ ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఆకుకూరలు, పెరుగు, కాయధన్యాల్లో ఉంటుంది.

శరీరంలో బలహీనత సమస్యతో బాధపడుతున్నవారు. నట్స్, తృణ ధాన్యాలు డైట్ లో చేర్చుకోండి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.

మరోవైపు ప్రతిరోజూ నట్స్, తృణ ధాన్యాలును తీసుకుంటే మీ బలహీనత, అలసట తొలగిపోతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు.