ఈ విత్తనాలతో మలబద్దక సమస్యకి చెక్.. 

14 August 2023

అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవిసె గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

అవిసె గింజలు మీకు మలబద్ధకం నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటిలో ఉండే మూలకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

వీటిని తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతో మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆహారంలో అవిసె గింజలను తప్పనిసరిగా చేర్చుకోవాలి.

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఈ గింజలు పేగు మంటని తగ్గించడంలో సహాయపడుతుంది.

అవిసెగింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. ప్రతి రోజు ఉదయం తీసుకుంటే ‘అలసట’ నుంచి ఉపశమనం పొందవచ్చు.

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అవిసె గింజ‌ల్లో ప‌లుర‌కాల క్యాన్సర్లను త‌గ్గించే గుణాలున్నాయి.

వెంట్రుక‌లు, చ‌ర్మ స‌మ‌స్యలు కూడ దూరమవుతాయి. అవిసె గింజ‌ల‌ను ఉద‌యాన్నే తింటే శ‌క్తి బాగా అందుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

కీళ్ల నొప్పులు కూడా పోతాయి. చేప‌లు తిన‌నివారికి అవిసె గింజలు మంచి ప్రత్యామ్నాయం. అవిసె నూనె వాడితే ప్రొస్టేట్‌, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు.