నిద్రపోయే సమయంలో నిద్రించే భంగిమ సరిగ్గా లేకపోతే ఎడమచేయి నొప్పి వస్తుంది. అందుకే సరైన భంగిమలో నిద్రపోవాలి.
ఇక కంప్యూటర్ దగ్గర పనిచేసేవారు కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోయినా ఎడమ చేయి నొప్పిగా అనిపిస్తుంది. ఆ భంగిమను సరి చేసుకుంటే ఎడమ చేయి నొప్పి తగ్గుతుంది.
శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయినా కొన్ని సార్లు ఎడమ చేయి నొప్పి వస్తుంటుంది. దీన్ని తగ్గించుకోవాలంటే రక్త ప్రసరణ మెరుగుపడే విధంగా తగిన వ్యవయం చేయాలి.
మంచి ఆహారం తీసుకోవాలి. మద్యపానం, ధూమపానం అలవాటు ఉన్నారు వీటికి దూరంగా ఉండడం మంచిది. ఇక ఎక్కువ సార్లు టీ, కాఫీలు తాగడం తగ్గిస్తే మంచిది.
అంతేకాదు రోజూ శరీరానికి సరిపడే మంచి నీరుని తాగాలి. శరీరానికి విశ్రాంతినిస్తూ.. సమయానికి నిద్ర పోవాలి. దీంతో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.
అయితే కొన్ని సార్లు ఎడమ చేయి నొప్పి గ్యాస్, అసిడిటీ సమస్య వల్ల కూడా వస్తుంటుంది. అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన విధంగా చికిత్స తీసుకోవాలి.
కొంతమంది క్యాన్సర్ బాధితుల్లో కూడా ఎడమ చేయి నొప్పి అధికంగా ఉంటుంది. దీనికి కారణం చికిత్స సమయంలో తీసుకునే మందులు.
ఇటువంటివారు ఎడమ చేయి నొప్పితో ఇబ్బంది పడుతుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన విధంగా చికిత్స తీసుకోవాలి.