గుండెజబ్బులు రావడానికి గల కారణాలు..

23 August 2023

స్థూలకాయన్ని తగ్గించుకోవడానికి బాగా ప్రత్నించాలి. గుండె జబ్బులు రావడానికి గల కారణాలలో స్థూలకాయం ఒకటి.

బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. తాజా కూరగాయలు, కార్బోహైడ్రేట్లు వుండే రైస్‌, పస్తా, బ్రెడ్‌ తినాలి.

గుండె రక్తనాళాల జబ్బులు ఎక్కువగా పురుషుల్లోనూ, మెనోపాజ్‌ వయసులోని స్త్రీలలోనూ వస్తాయి. పొగతాగేవారిలో ఈ గుండె జబ్బు చాలా ఎక్కువగా వస్తుంది.

పొగలో ఉండే నికోటిన్‌, రక్తనాళాలను సంకోచించేటట్లు చేస్తుంది. ఇవి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టేటట్లు కూడా చేస్తుంది.

ఎక్కువ శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ.

అధిక బరువు వున్నవారిలో కూడా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. మధుమేహవ్యాధి గుండె , రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయి.

అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటి కొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు రావడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.

కొవ్వు పదార్ధాలలో ముఖ్యంగా కొబ్బరినూనె, డాల్డా, నెయ్యి, మార్జరిన్‌ ఎక్కువగా ఈ గుండె వ్యాధులను కలిగిస్తాయి.