ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్.. ఏది మంచిది..?

12 November 2023

గుడ్డులో అనేక పోషకాలు దాగున్నాయి. అందుకే దీనిని పోషకాల నిధిగా పేర్కొంటారు. ప్రతి వ్యక్తి రోజూ కనీసం ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అనేక పోషకాలు 

గుడ్లలో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12, బయోటిన్, థయామిన్, రిబోఫ్లావిన్, యాంటీఆక్సిడెంట్లు, సెలీనియం వంటి అనేక ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. 

ఖనిజాలు.. పోషకాలు

గుడ్లు ప్రోటీన్ కు గొప్ప మూలం. ఎముకల ఆరోగ్యం, కంటి ఆరోగ్యంతో సహా మన మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. 

ఆరోగ్యానికి..

అయితే, కొందరు ఉడకబెట్టిన కోడిగుడ్లను.. మరికొందరు ఎగ్ ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతారు. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమో తెలుసా? 

ఏది మంచిది..?

ఉడకబెట్టిన గుడ్లను ఎక్కువగా తింటారు. ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. గుడ్డును కేవలం నీటిలోనే ఉడకబెడతారు. కావున అందులో ఎలాంటి క్యాలరీలు ఉండవు. 

ఉడకబెట్టిన గుడ్డు..

చాలా మంది ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతారు. ఆమ్లెట్ చేయడానికి నూనె లేదా వెన్నను ఉపయోగిస్తారు. దీనివల్ల కేలరీలు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.  

ఆమ్లెట్..

ఆరోగ్యకరమైన ఎంపికల విషయానికి వస్తే, ఆమ్లెట్ కంటే ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో అదనపు పదార్థాలు ఉండవు.. 

ఎక్కువ మేలు