వాటికి దూరంగా ఉంటే రాత్రి వేళల్లో మంచి నిద్ర..
20 August 2023
కొన్నిసార్లు నిద్రపోవడం కష్టంగా ఉండవచ్చు. కానీ.. మంచి రాత్రి నిద్ర పొందడం చాలా ముఖ్యం. ఇది హార్మోన్లు, ఎంజైమ్‌ల మెరుగైన పనితీరులో సహాయపడుతుంది.
నిద్రకు ఆటంకం కలిగించే అనేక కారణాలు ఉంటాయి. కొన్ని అలవాట్లు రాత్రి నిద్రను పాడుచేస్తాయి. కావున మంచిగా నిద్ర పోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచిది.
సాయంత్రం, రాత్రి వేళల్లో బ్లూ లైటింగ్‌ను నివారించండి. ఇదితక్కువ మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల రాత్రి నిద్రపోవడం కష్టంగా మారుతుంది.
కావున సాయంత్రం వేళల్లో స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడం ఉత్తమం. అందుకే ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లకు దూరంగా ఉండండి.
కెఫిన్ పానీయాలు రాత్రివేళ తాగడం మంచిది కాదు. కెఫిన్ కలిగిన పానీయాలు తాగినప్పుడు, అది శరీరానికి శక్తిని ఇస్తుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.
రాత్రి వేళల్లో కెఫిన్ పానీయాలు తాగడం వల్ల నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. అందుకే రాత్రి వేళల్లో టీ, కాఫీ, పొగకు దూరంగా ఉండటం మంచిది.
పడుకునే ముందు వ్యాయామాన్ని నివారించండి. నిద్రవేళకు 3-4 గంటల ముందు వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర పొందవచ్చు.
అయితే పడుకునే ముందు వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుకుదనం పెరుగుతుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగించే కొన్ని హార్మోన్లను పెంచుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి