ఆరోగ్యంగా ఉండాలనుకునే వారి పుచ్చకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాటర్ మిలాన్‌తో శరీరం చల్లబడుతుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు.
రోగనిరోధక వ్యవస్థను శక్తివంతంగా చేయడంలో పైనాపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉండే పైనాపిల్‌తో ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పపైన్, చైమోపపైన్ వంటి ఎంజైమ్‌లు జీర్ణక్రియ రేటును పెంచుతాయి.
యాపిల్‌లోని పెక్టిన్ జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పని తీరుని మెరుగుపరుస్తుంది.
కివి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది.
అరటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు శరీరానికి మేలు చేస్తాయి
విటమిన్ సి, కె, పొటాషియంకు పెట్టింది పేరైన పియర్స్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, పేగులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.