ఎండకాలం కచ్చితంగా కొబ్బరి నీరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులోని ఎలక్ట్రోలైట్స్ మేలు చేస్తాయి.
మజ్జిగ తీసుకోవడం వల్ల ఎండకాలం మేలు జరుగుతుంది. ఇందులోని ప్రోబయోటిక్స్, విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని సహజంగా చల్లబరుస్తుంది.
వేడిని తగ్గించడంలో పుదీనా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.పెరుగు, మజ్జిగ, లేదా నిమ్మ నీటిలో పుదీనా కలుపుకుంటే మరింత మంచిది.
నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయను సమ్మర్‌లో కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది డీహైడ్రేషన్‌ను దూరం చేసి, శరీర వేడిని నియంత్రిస్తుంది.
నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిలో దోసకాయలు కూడా ఒకటి. ఇందులో నీటి శాతం శరీరంలో అదనపు కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.
నిమ్మకాయలో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇది శరీరాన్ని మాయిశ్చరైజ్, ఆక్సిజనేట్ చేస్తుంది
ఉల్లిపాయలు కూడా వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వడదెబ్బ నుంచి రక్షించడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.