చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో నడవటం వల్ల ప్రయోజనాలు..

15 August 2023

చెప్పులు లేని పాదాల నడక పాదాల్లోని కండరాలను స్థిరంగా ఉండేటట్లు చేస్తాయి. కాళ్లలోని, పాదాల్లోని చిన్న, పెద్ద కండరాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది.

ఈ న్యూరల్‌ కనెక్షన్ దెబ్బతింటే గాయాలు బాగా తగిలే అవకాశం ఉంది. కనుక కండరాల స్థిరంగా ఉండేలా కొంచెం సేపు ఉత్తి పాదాలతో నడవం మంచిది అని అంటున్నారు.

చెప్పులు లేకుండా ఉత్త పాదాలతో నడిస్తే కాళ్లకు గాయాలు కావట. అంతేకాదు నడక స్థిరంగా ఉంటుందట. శరీర భంగిమ కూడా కరక్ట్‌గా ఉంటుందిట.

చెప్పులు లేకుండా నడిచేవారు శరీరాన్ని సరిగా బ్యాలెన్స్ చేసుకుంటారట. మట్టిపైన, ఫ్లోర్ పైన నడవడం వల్ల నరాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది.

కండరాలు సరిగా పనిచేయకపోతే లిగ్మెంట్స్‌ మీద, ఎముకల మీద, టెన్డెన్స మీద ప్రభావం పడి గాయపడి ప్రమాదం పెరుగుతుంది.

పిల్లలు ఒట్టి పాదాలతో నడిస్తే డయాబెటిస్, ఓబేసిటి సమస్యలు తలెత్తవట. అందుకనే పిల్లలు చెప్పులు లేకుండా నడవడం, పరుగెత్తడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

పిల్లలు చెప్పులు లేకుండా నడవం వలన బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది. పాదాలు, కాళ్లు , కండరాలు పనితీరు సరిగ్గా ఉండాలంటే చెప్పుల్లేకుండా నడవాలి.

షూలు ధరించే వారి కంటే ధరించని వ్యక్తుల పాదాలు చాలా స్ట్రాంగ్ గా , హెల్తీగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన పాదాలకోసం కొంతసేపు అయినా చెప్పులు తిరగాలంటున్నారు.