ఎండు ద్రాక్షలతో ఎన్నో ప్రయోజనాలు.. అస్సలు మిస్ కావొద్దు..!
ఎండు ద్రాక్షలల్లో శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు, నేచరల్ షుగర్‌లు పుష్కలంగా ఉన్నందున ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు సత్వర శక్తిని అందిస్తాయి.
ఎండు ద్రాక్షలను ప్రతి నిత్యం తినేవారు ఆరోగ్యం, సరిపడినంత బరువుతోనే ఉంటారు. ఇంకా ఊబకాయం సమస్య వీరి దరికి చేరదు.
ఎండుద్రాక్షలల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్ రక్తహీనతతో బాధపడేవాళ్లకు మేలు చేస్తుంది. ఐరన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తిని పెంచి రక్తహీనతను నివారిస్తుంది.
వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి కూడా మేలు చేస్తాయి. ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించడంతో పాటు స్కిన్ క్యాన్సర్ కణాలను విచ్చిన్నం చేస్తాయి.
పీచుపదార్థాలకు మంచి మూలమైన ఎండు ద్రాక్షలు జీర్ణవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఫలితంగా మలబద్ధకం, అజీర్తి సహా ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఎండు ద్రాక్షాల్లోని నేచురల్ షుగర్లు ఉన్నందున మధుమేహంతో బాధపడేవారి రక్తంలో చక్కెర స్థాయిల ఎలాంటి చెడు ప్రభావం చూపవు. పైగా ఇవి తక్కువ మొత్తంలో గ్లైకామిన్ ఇండెన్స్‌ను కలిగి ఉంటాయి.
ఎండు ద్రాక్షలు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. తద్వారా హృదయ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
అలాగే కాల్షియం, ఫాస్పరస్ ఉన్నందున ఎండు ద్రాక్షలు దంతాలు, ఎముకలను దృఢపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇంకా బోలు ఎముకల సమస్యను నివారిస్తాయి.