వంకాయలో గ్లైకాల్-ఆల్కలాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు, విటమిన్లు అధికంగా ఉన్నాయి. వంకాయలు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
బర్న్స్, మొటిమలు, ఇన్ఫ్లమేటరీ ఇన్ఫెక్షన్లు, పొట్టలో పుండ్లు, స్టోమాటిటిస్ , ఆర్థరైటిస్ వంటి వివిధ రుగ్మతలను నివారించడంలో వంకాయ అద్భుతంగా పనిచేస్తుంది.
వంకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల వంకాయ తినగానే కడుపు నిండినట్లు కూడా ఉంటుంది.
వంకాయలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు కణ త్వచాలను రక్షిస్తాయి.మెదడు యొక్క జ్ఞాపకశక్తి పనితీరును పెంచుతాయి.
ఫ్రీ రాడికల్ కణాల నిర్మూలనకు విరుద్ధంగా దాని కణాన్ని రక్షించి మెదడు ఆరోగ్యాన్నిమెరుగుపరుస్తుంది. బ్రెయిన్ ట్యూమర్‌ను నివారించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
వంకాయ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు , యుక్తవయస్సులో ఉన్న ఆడవారికి ప్రత్యేకంగా వంకాయ మేలు చేస్తుంది.
అయితే కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు. ఎందుకంటే వంకాయ అందరికీ వంకాయ పడదు. అందుకే తినరు.
స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండటమే చాలా మంచిది. ఎక్కువ గా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు