రోజూ వజ్రాసనం వేయడం వల్ల ప్రయోజనాలు..

31-JULY-2023

నేలపై మోకరిల్లాలి. మీ కటిని మడమల మీద ఉంచి.. మోకాళ్లు, చీలమండలను స్ట్రెచ్ చేయాలి.

మడమలను ఒకదానికొకటి దగ్గరగా ఉంచాలి. అరచేతులను మోకాళ్లపై లేదా తొడలపై ఉంచాలి.

సౌకర్యవంతంగా ఉండే వరకు కటిని కొద్దిగా వెనుకకు, ముందుకు సర్దుబాటు చేసుకోవాలి.

వజ్రాసనం వలన మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది.

ఈ ఆసనం జీర్ణ ఆమ్లత్వం, గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది.

మోకాలి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తొడ కండరాలను బలపరుస్తుంది.

లైంగిక అవయవాలను బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది.

మూత్ర సంబంధిత సమస్యల చికిత్సలో సహాయపడుతుంది.