ఆయుర్వేదం ప్రకారం.. అరటితో అనేక ప్రయోజనాలు.. 

22 August 2023

అరటి పండు సులభంగా జీర్ణమై, మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. భోజనం తరువాత అరటి పండు తినడం ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.

రోజు అరటి పండు తినడం వల్ల బరువు, ఊబకాయం, విరేచనాలు, రక్తహీనత, క్షయవ్యాధి, ఆర్థరైటిస్, మూత్రపిండాలు, మూత్ర రుగ్మతల నుండి అరటి పండు కాపాడుతుంది.

పచ్చి అరటి కాయలు విరేచనాలనూ, పండిపోయినవి మలబద్ధాన్నీ అల్సర్ల నూ అరికడతాయి. వీటితో కూరలు, బజ్జిలు వంటివి వేసుకొనే తింటారు.

అరటిపువ్వు తో చేసిన వడియాలు రుచికరమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దగ్గు , ఆయాసం మొదలైన శ్వాస రోగాలను నివారిస్తాయి.

అరటిఆకు భోజనం చేయడం వలన జ్వరం , క్షయ, కఫవాతం, దగ్గు , ఉబ్బసం మొదలయిన వ్యాధులను నివారిస్తుంది. అంతేకాదు వీర్యబలాన్ని, ఆయువుని పెంచుతుంది.

అతి రుతు రక్తశ్రావంతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు బాగా మగ్గిన అరటి పండుని దేశీయ ఆవునెయ్యి తో రోజుకి మూడు సార్లు తింటే రక్త శ్రావం అదుపులోకి వస్తుంది.

కాలిన గాయాలకు కమ్మని లేపనం బాగా పండిన అరటిపండు గుజ్జు. కాలిన గాయాలపై బాగా పండిన అరటిపండు గుజ్జుని లేపనంగా రాస్తే గాయాలు త్వరగా మానతాయి.

మూత్రంలో మంటతో ఇబ్బంది పడుతున్నవారు బాగా మెత్తగా ఉన్న పసుపు పచ్చని చిన్న అరటి పండు తరుచు తింటే ఉంటే మంట తగ్గుతుంది.