శీతాకాలంలో ఆవాల నూనెతో ఆ సమస్యలన్నీ దూరం.. 

06 December 2024

TV9 Telugu

శీతాకాలం సమయంలో ఆవాల నూనెను ఉపయోగిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు పోషకాహార నిపుణులు.

ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించి తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్‌ తగ్గిపోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అధిక రక్త పోటు సమస్య ఉన్నవారు ఆవాల నూనె వాడటం చాలా మంచిది.

ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల రక్త పోటును అదుపు చేయవచ్చు.

ఆవాల నూనె తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది మెరుగు పడుతుంది. దీంతో వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు.

ఆవాల నూనె తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణ శక్తి అనేది మెరుగు పడుతుంది. బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆవాల ఆయిల్ ఉపయోగించడం వల్ల మూత్ర పిండాల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

థైరాయిడ్ సమస్యతో బాధ పడేవారు కూడా ఆవాల ఆయిల్ వాడటం మంచిది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి.