ఈ తప్పుల కారణంగా ఇయర్‌బడ్‌లు పాడైపోతాయి..!

01 December 2024

TV9 Telugu

క్వినోవా.. ఇందులో పోషకాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అమెరికా వంటి పాశ్చాత్య దేశాలలో క్వినోవాను ఆరోగ్యకర ఆహారంగా భావిస్తారు.

దీర్ఘకాలికంగా వేధిస్తున్న వ్యాధులను తగ్గించడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు క్వినోవాలో దాగున్నాయి.

క్వినోవాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫైటోన్యూట్రియెంట్‌లు పుష్కలంగా లభిస్తాయి. గుండెకు ఆరోగ్యం చేకూర్చే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.

సాధారణ తృణధాన్యాలతో పోల్చితే, మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు క్వినోవాలో పుష్కలంగా ఉంటుంది. ఫైబర్.. బార్లీలో కంటే ఎక్కువగా క్వినోవాలో ఉంటుంది.

బరువు తగ్గాలనుకునేవారికి క్వినోవా బెస్ట్‌ చాయిస్‌. క్వినోవాలో ఉండే ప్రోటీన్, ఫైబర్ సమ్మేళనాలు.. పొట్టను నిండుగా ఉంచి, ఆకలిని తగ్గిస్తుంది.

క్వినోవా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటం వల్ల దాని శక్తి నెమ్మదిగా విడుదలవుతూ ఆకలిని నియంత్రిస్తుంది.

రక్తంలో చక్కెర లెవల్స్‌ను బ్యాలెన్స్‌ చేయడంలో క్వినోవా అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

క్వినోవాలో ఉండే ఫైబర్‌ జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు వృధ్యాప్య ఛాయలు రాకుండా చూస్తాయి.