అనారోగ్య చింతన ఎలా దండగ.. ఇంగువ మీ డైట్ లో ఉండగ.. 

TV9 Telugu

09 February 2025

పేగు కండరాలను సడలించడం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గించడంలోనూ రుచి కోసం ఉపయోగించే ఇంగువ బాగా పని చేస్తుంది.

నొప్పులు, వాపులు వంటి సమస్యలను తగ్గించడంలో ఇంగువ ప్రయోజనకారిగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల శరీర కణాలకు కలిగే నష్టం నుండి రక్షిస్తాయి.

సాంప్రదాయ వైద్యంలో ఆస్తమా, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి ఇంగువను ఉపయోగిస్తారు.

ఆహారంలో ఇంగువను తీసుకోవడం లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇంగువను రోజూ తీసుకుంటూ ఉంటే అది ఇమ్యూనిటీ సిస్టమ్ ను బలోపేతం చేస్తుంది. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే అసౌకర్యాలను పరిష్కరించడంలో కూడా ఇంగువ పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు.

ఇంగువలో ఉండే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు గర్భాశయ కండరాలను సడలించడంలో సహాయపడతాయని చెపుతున్నారు నిపుణులు.