డ్రాగన్ ఫ్రూట్ 10 ఆరోగ్య ప్రయోజనాలు..

11 AUGUST 2023

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, బీటాలైన్‌లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానీకరమైన ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

డ్రాగన్ ఫ్రూట్‌ శరీరంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది

డ్రాగన్ ఫ్రూట్‌లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఇందులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొవ్వును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గుండె ఆరోగ్యం

డ్రాగన్ ఫ్రూట్‌లో తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్

ఇందులో బీటా కెరోటిన్, లుటిన్ ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి.

కంటి ఆరోగ్యం

డ్రాగన్ ఫ్రూట్‌లో అధిక నీరు ఉంటుంది. ఇది శరీరం హైడ్రేట్‌గా ఉండేలా చూస్తుంది.

హైడ్రేట్‌గా ఉంచుతుంది

ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువు నియంత్రణలో ఇది సహకరిస్తుంది.

బరువు నియంత్రణ

డ్రాగన్ ఫ్రూట్‌లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకలను స్ట్రాంగ్‌గా మారుస్తాయి.

ఎముకల ఆరోగ్యం