01 June 2024

ఈ గింజలు రోజుకు ఓ స్పూన్ తినండి.. తేడా మీకే తెలుస్తుంది. 

Narender.Vaitla

అవిసె గింజల్లో ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరచేరవు. జీర్ణ వ్యవస్థ బలోపేతమవుతుంది.

అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వారికి అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఆల్ఫాలినోలెయిక్‌ ఆమ్లాలు ఉంటాయి ఇవి బీపీని కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడతాయి.

క్యాన్సర్‌ మహమ్మారిని జయించడంలో కూడా అవిసె గింజలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇందులోని ఔషధ గుణాలు పెద్ద పేగు క్యాన్సర్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

అవిసె గింజలు చర్మం ఆరోగ్యాన్ని రక్షిస్తాయని నిపునులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు యాంటీ ఏజింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఇవి చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.

ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌కు అవిసె గింజలు పెట్టింది పేరు. ఇది వెంట్రుకల కదుళ్లని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వెంట్రుకలు బలంగా, ఒత్తుగా మారుతాయి.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా అవిసె గింజలు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీంతో బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

కీళ్ల నొప్పులు, వాపులు, కీళ్ల వాతం నిర్మూలనకు అవిసె గింజలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. ముఖ్యంగా అవిసె గింజలను వేయించి పొడి చేసుకొని ఆహార పదార్థాలల్లో కలుపుకొని తీసుకుంటే ఆరోగ్యం మెరుగువుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.