TV9 Telugu

24 March 2024

ఏంటి సోంపుతో ఇన్ని లాభాలున్నాయా.? 

సోంపులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ప్రోటిన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే భోజనం చేస్తే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. దీంతో కడుపుబ్బరం, గ్యాస్‌, అజీర్తి వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు

ఇక నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టడంలో కూడా సోంపు ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటిలోని బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా సోంపు ఎంతగానో ఉపయోగపడుతుంది.. మెరుగైన జీర్ణక్రియతో బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు సోంపులో పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎనిథోల్ అనే సమ్మేళనం క్యాన్స్‌ కణాలను నశింపజేస్తుంది.

సోంపు గింజలను నమడంల వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

రక్త హీనతకు చెక్‌ పెట్టడానికి కూడా సోంపు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఐరన్‌ రక్త హీనత సమస్య దరిచేరనివ్వదు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.