గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తరచూ తలనొప్పితో బాధపడుతున్నారా.? అయితే రోజూ పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని కాల్షియం తలనొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. పెరుగును రోజు తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి.
గుండెలో మంట, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేయడంలో పెరుగు కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సమస్యలున్న వారు రెగ్యులర్‌గా పెరుగు తీసుకోవాలి.
మలబద్ధకం సమస్యలతో బాధపడే వారు నిత్యం క్రమంతప్పకుండా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ప్రోబయోటిక్స్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ప్రోటీన్స్, మినరల్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చర్మం మెరిసేలా చేస్తాయి.
బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే రోజూ కచ్చితంగా పెరుగును తీసుకోండి. ఇందులో తక్కువ కేలరీలు ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమి సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.