30 May 2024

నిజంగా.. దోసతో ఇన్ని లాభాలున్నాయా.? 

Narender.Vaitla

యాంటీ ఆక్సిడెంట్స్‌కు దోసకాయ పెట్టింది పేరు. ఇవి దీర్ఘకాల జబ్బుల బారినపడకుండా ఉండడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. క్రమంతప్పకుండా దోస తీసుకుంటే వ్యాధుల బారిన పడడం తగ్గుతుంది

దోసకాయలోని నీటిశాతం శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా ఉండడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా అజీర్ణం, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు దరిచేరకుండా చూస్తాయి.

ఇక దోసకాయలోని నీటి శాతం కిడ్నీలు, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ప్రతీరోజూ కచ్చితంగా ఒకకటైనా దోసను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో దోసకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఔషధ గుణాలు ఎముకలను బలంగా మార్చడంలో ఉపయోగపడతాయి.

జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ప్రతీరోజూ కచ్చితంగా దోసకాయను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి దోస దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని నీటి శాతం కారణంగా త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

దోసకాయలో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం