ఇవి ఎక్కడ కనిపించినా వెంటనే తినేయండి.. 

12 september 2023

వీటిని మఖానాను ఫాక్స్‌ నట్స్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాల ఉన్నాయి. వీటిని క్రమంతప్పకుండా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

 మఖానాలో ఐరన్‌, మాంగనీస్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. వీటి వల్ల శరీరం నిత్యం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

హైపర్‌ టెన్షన్‌ తగ్గించడంలో మఖానా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. 

క్రమంతప్పకుండా మఖానాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. 

ఇక మఖానాలో ఉండే మెగ్నీషియం రక్తంలోని ఆక్సిజన్‌ నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

బరువు తగ్గడానికి కూడా మఖానా దివ్యౌషధంలా ఉపయోగపడుతుంది. మఖానాలో ఉండే ప్రోటీన్‌ బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

వీటిని నిత్యం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవ్చు. డయాబెటిస్‌ బాధితులకు ఇది మంచి ఫుడ్‌గా చెబుతున్నారు. 

పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.