07 June 2024

ఈ అలవాట్లు మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

Narender.Vaitla

ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుంది, ఇది జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలకు కారణమవుతుంది.

సరిపడ నిద్రలేక పోయినా మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, అభిజ్ఞా సామర్థ్యాలను దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవడం.

ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో గడిపే వారికి కూడా మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఇది మానసిక రుగ్మతలు, అలసట, నిద్రలేమికి దారి తీస్తుందని చెబుతున్నారు.

సరిపడ నీరు తీసుకోకపోయినా మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్‌కి గురైతే జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనతీరు తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

టిఫిన్‌ మానేయడం వల్ల కూడా మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు.ఇది మెదడు పనితీరును దెబ్బతిస్తుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 8 గంటల్లోపు అల్పాహారం తీసుకోవాలని చెబుతున్నారు.

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే బీట్‌రూట్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు మతిమరుపు, అల్జీమర్స్‌ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. 

క్యారెట్లు కూడా మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ ర్యాడిక్సల్స్‌ను ఎదుర్కోవడంలో క్యారెట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం