సంపూర్ణ ఆరోగ్యానికి సూపర్‌ హీరో సపోటా జ్యూస్‌.. బెనిఫిట్స్‌ తెలిస్తే..

03 April 2024

Jyothi Gadda 

సపోటా జ్యూస్ లో ఉండే స్పెషల్ కంటెంట్స్..టానిన్స్ యాంటీ ప్యారాసిటిక్, యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సపోటా జ్యూస్ లో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. 

సపోటా జ్యూస్ నాడీవ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది స్ట్రెస్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. సపోటా జ్యూస్ లో ఉండే క్యాల్షియం బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. బోన్ క్వాలిటీ పెంచుతుంది.

సపోటా జ్యూస్ లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. ఇది నిరోధకత పెంచడంలో సహాయపడుతుంది. హానికరమైన ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. రెగ్యులర్ గా సపోటా జ్యూస్ తాగడం వల్ల వైరల్, బ్యాక్టీరియల్, ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ లో ప్యారాసిస్టిక్ ఎఫెక్ట్స్ ను తొలగిస్తుంది.

విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంలో మ్యూకస్ ఏర్పాటుకు సహాయపడుతుంది. సపోటా జ్యూస్ లో ఉండే విటమిన్ ఎ లంగ్స్ మరియు సర్వికల్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

సపోటా జ్యూస్ లో ఫ్రక్టోజ్. సుక్రోజ్ లు అధికంగా ఉన్నాయి. ఇది ఎనర్జీని అందిస్తుంది. శరీరానికి ఇన్ స్టాంట్ గా శక్తిని అందిస్తుంది. ఇది గర్భిణీల మహిళలకు చాలా ప్రయోజనం కలిగిస్తుంది. మరియు పెరిగే పిల్లలకు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

సపోటా జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్, అందిస్తుంది. దాంతో జుట్టు స్మూత్ గా, సాప్ట్ గా పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి తలలో బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. చుండ్రు ఏర్పడకుండా నివారిస్తుంది. 

సపోటా జ్యూస్‌తో స్కిన్ బెనిఫిట్స్‌ చాలా ఉన్నాయి. ఇంఉదలో ఉండే విటమిన్ ఎ, సిలు స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. డ్రై స్కిన్ నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది. ఇది స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. చర్మంలో ఎలాసిటి పెరుగుతుంది. లిగమెంట్స్ త్వరగా రికవర్ అవుతాయి.

సపోటా జ్యూస్ లో విటమిన్ సి, ఎ, వివిధ రకాల మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది స్కిన్ కంప్లెక్స్ ను మెరుగుపరుస్తుంది. నేచురల్ స్ట్రక్చర్ అందిస్తుంది. సపోటా జ్యూస్ ను తాగడం వల్ల ముడుతలను,చారలను, ఏజింగ్ లక్షణాలను తొలగిస్తుంది.సన్ బర్న్ ఎఫెక్ట్ ను తొలగిస్తుంది.