చాక్లెటే కదా అని తీసిపారేయకండి.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం

Ravi Kiran

July 7th, 2025

ఈరోజు వరల్డ్ చాక్లెట్ డే.. చాక్లెట్లు తింటే ఆరోగ్యం పాడవుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ డార్క్ చాక్లెట్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 

ప్రతీరోజు కొద్దిగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల రక్తపోటు తగ్గి.. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి

డార్క్ చాక్లెట్‌లో న్యూరోమోడ్యులేటర్ అనే పదార్ధం ఉంది. ఇది మనుషుల్లో ఒత్తిడిని తగ్గించడమే కాదు.. వారి మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.  

ప్రతీ రోజూ డార్క్ చాక్లెట్ తినడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడితో పాటు ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతుంది

డార్క్ చాక్లెట్‌ తినడం ద్వారా మీ జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు మీలో కనిపించే వృద్ధాప్య సంకేతాలను సైతం తగ్గిస్తుంది 

డార్క్ చాక్లెట్ తినేవారిలో బరువు, శరీర కొవ్వు కూడా తగ్గినట్టు కొన్ని అధ్యయనాల్లో పేర్కొన్నారు. 

అలాగే డార్క్ చాక్లెట్ రోజుకు అర ఔన్స్ మాత్రమే తీసుకోవాలి. గుండె సంబంధ వ్యాధుల నివారణ అధ్యయనంలో కూడా 0.7 నుంచి 1.5 ఔన్సుల మధ్య తీసుకున్నట్టు తేలింది.

డార్క్ చాక్లెట్ తింటే మూడ్ మారుతుందని చెబుతుంటారు. చిన్న ముక్క డార్క్ చాక్లెట్ మూడ్ బూస్టర్‌గా పని చేస్తుంది.