రాత్రి భోజనం తర్వాత మజ్జిగ తాగితే, దాని ప్రయోజనాలే వేరప్పా..!

21 December 2023

మజ్జిగలో శరీరానికి అవసరమైన విటమిన్లు సి, ఎ, ఇ, కె మరియు బి వంటి చాలా పోషకాలు ఉన్నాయి. 

మజ్జిగలో కేలరీలు తక్కువగానూ, కొవ్వు శాతం తక్కువగానూ ఉండటం వల్ల మనల్ని ఊబకాయం నుంచి దూరం చేస్తుంది.

మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

భోజనం తర్వాత మజ్జిగలో జీలకర్ర కలిపి తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మలబద్ధకం సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మజ్జిగలో ఉండే యాసిడ్ మీ పొట్టను క్లియర్ చేస్తుంది. రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు.

వేయించిన జీలకర్ర, నల్లమిరియాల పొడి, రాళ్ల ఉప్పును మజ్జిగలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆహారం తిన్న తర్వాత మజ్జిగ తాగితే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

రోజూ ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగుకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది.