తులసి టీ అమృతమే..ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో 

18 September 2023

తులసి తీర్ధమే కాదు తులసి టీ కూడా అమృతమే.. పవిత్రమైన మొక్క ఆరోగ్యప్రదాయిని.. తులసి ఆకులలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 

తులసి ఆకుల్ని ఉడికించి నిమ్మరసం కలిపి తీసుకుంటే మధుమేహం ఉన్నవారికి ఎంతో మంచిది. దీనిలో ఉండే పాలీశాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలోని షుటర్ లెవల్‌ని అదుపు చేస్తాయి.

తులసి టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉండేలా.. ముడతలు పడకుండా చేస్తాయి. చర్మ కణాలను పునరుద్ధరించే శక్తి ఈ టీ సొంతం.

తరచూ జలుబుతో బాధపడేవారు రోజుకు రెండు కప్పులు తులసి టీ తాగాలి. దీనిలోని యాంటీ బయోటిక్స్  జలుబుతోపాటూ ఇతర ఇన్‌ఫెక్షన్లూ దూరం చేస్తాయి

తులసి టీలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలు క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి

ఈ టీలో లభించే బీటాకెరొటిన్ గుండెకు మేలు చేస్తుంది. గుండెకు రక్త సరఫరా సక్రమంగా ఉండేలా చేస్తాయి. ఈ టీ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది

మూత్రవిసర్జనలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెరతోపాటు కలిపి మరిగించి లేదా పచ్చిగా అయినా తీసుకోవాలి

తులసి టీ తయారీ: తాజా తులసి ఆకులు,  అల్లం ముక్క,  తేనే, కొంచెం నిమ్మరసం, ఏలకులు,  మంచి నీరు తీసుకోవాలి

తయారీ విధానం: ముందుగా నీటిని మరిగించాలి. అందులో తులసి ఆకులతో పాటు నిమ్మరసం మినహా వేయాలి. కొంచెం సేపు తులసి నీటిని మరిగించి చివరిగా నిమ్మరసం వేస్తే తులసి టీ రెడీ.