30 రోజులు షుగర్ మానేస్తే ఏమవుతుందో తెల్సా

07 July 2025

Ravi Kiran

షుగర్ లేకుండా మనకు రోజు గడవదు. టీ, బిస్కెట్స్, కేక్స్ ఇలా ఏదో ఒక రకంగా చక్కెర మన శరీరంలోకి వెళ్తూనే ఉంటుంది. 

కానీ చక్కెర అధికంగా తినడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మితంగా తీసుకోవాలని చెబుతున్నారు. 

మరి 30 రోజుల పాటు చక్కెరను పూర్తిగా మానేస్తుందో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఇది చిన్న ప్రయత్నం అయినా.. పెద్ద మార్పు కనిపిస్తుంది. 

ఈ షుగర్‌ను 30 రోజుల పాటు మానేస్తే ఎన్నో జబ్బులను దూరం చేయొచ్చునని వెల్‌నెస్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. అలాగే కాకుండా  కిడ్నీ పనితీరు మెరుగవుతుందని చెబుతున్నారు. 

లివర్ ఫ్యాట్ తగ్గడం, హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గడం, ఆలోచనల్లో స్పష్టత, ఫోకస్ పెరగడం, రోగనిరోధక శక్తి స్ట్రాంగ్ అవడం వంటి లాభాలున్నాయని అంటున్నారు.  

మొదట్లో కొంచెం కష్టం అనిపించినా.. చక్కెర తినే అలవాటు మానుకోవడం అంత సులభం కాకపోయినా.. ఒకసారి ఇలా ప్రయత్నించమని చెబుతున్నారు వైద్య నిపుణులు. 

క‌నీసం నెల రోజుల పాటు క‌ఠినంగా చ‌క్కెర లేని డైట్‌ను పాటిస్తే.. అనారోగ్య సమస్యలు దరికి చేరవని వైద్యులు చెప్పారు.