అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

TV9 Telugu

30 January 2024

ఆల్కహాల్ వినియోగం ఎక్కువగా ఉన్నపుడు  ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. కొవ్వు వల్ల లివర్‌లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. 

ఈ స్థితిలో లివర్ సెల్ఫ్ హీలింగ్ కోసం ప్రయత్నం చేస్తుంది. చికిత్స చెయ్యకుండా వదిలేస్తే కాలేయంపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి.. సిర్రోసిస్ వంటి సీరియస్ సమస్య వస్తుంది.

ఫ్యాటీ లివర్ సమస్య మొదలైన తర్వాత ఆల్కహాల్ మానేసిన రెండు, మూడు వారాల్లో కాలేయం తిరిగి కోలుకుంటుంది. 

అదే కాలేయంలో తేలికపాటి మచ్చలు ఏర్పడితే ఆల్కహాల్ మానేసిన ఏడు రోజుల్లో మచ్చలు గణనీయంగా తగ్గుముఖం పడుతాయి. కొన్ని నెలల పాటు పూర్తిగా ఆల్కహాల్ మానేస్తే కాలేయం పూర్వపు స్థితికి చేరుతుంది. 

సమస్య తీవ్రంగా ఉన్నపుడు లివర్ సిర్రోసిస్ ఏర్పడినపుడు కూడా ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేస్తే లివర్ ఫెయిల్యూర్ వల్ల మరణించే ప్రమాదం తగ్గుతుంది. 

ఆల్కహాల్ మానెయ్యడం వల్ల నిద్ర, మెదడు పనితీరు, రక్తపోటు మీద మంచి ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఆల్కహాల్ కు దూరంగా ఉంటే అనేక రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం  తగ్గుతుంది.

ఆల్కహాల్ వ్యసనంగా మారిన వారిలో అకస్మాత్తుగా మానేస్తే అది విత్ డ్రావల్ లక్షణాలకు కారణం అవుతుంది. 

తీవ్రమైన వ్యసనంలో ఉన్నవారు అకస్మాత్తుగా, పూర్తిగా మానెయ్యకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో ఈ వ్యసనం నుంచి బయటపడాల్సిందిగా సలహా ఇస్తున్నారు.