ఈ పేపర్ కప్పులను ఉపయోగించిన తర్వాత కడగాల్సిన అవసరం ఉండదు. ఒకసారి టీ తాగి చెత్తబుట్టలో పడేయొచ్చు. కొన్ని కొన్ని సార్లు మనం ఈ రకమైన కప్పులను ఇంట్లో కూడా ఉపయోగిస్తుంటారు.
కాగితపు కప్పుల్లో పెట్రోలియం ఆధారిత రసాయనం బిస్ఫెనాల్ ఉంటుంది. ఇది శరీరానికి హానికరం. ముఖ్యంగా ఇలాంటి కప్పుల్లో టీ తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.
వీటిలో ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే క్రిములు కూడా ఉంటాయి. ఈ కప్పుల్లో ఉపయోగించే పూతలలో ఈ హానికరమైన బిస్ఫెనాల్స్, పెట్రోలియం ఆధారిత రసాయనాలు ఉంటాయి.
ప్రతిరోజూ ఒక పేపర్ కప్పులో టీ తాగడం వల్ల శరీరంలో బీపీఏ పెరుగుతుంది. ఇది శరీరానికి చాలా హానికరం. శరీరంలో బీపీఏ స్థాయి పెరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
డిస్పోజబుల్ పేపర్ కప్పులో మూడుసార్లు 100 మి.లీ. చొప్పున వేడి వేడి టీ తాగడం వల్ల 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్తాయని పరిశోధకులు వెల్లడించారు.
డిస్పోజబుల్ పేపర్ కప్పులో వేడివేడి కాఫీ, టీ వంటివి తాగినప్పుడు క్రోమియం, కాడ్మియం వంటి హానికారక లోహాలు శరీరంలోకి వెళ్తాయని పేర్కొన్నారు.
అంతేకాదు మృదువైన, తేలికైన ప్లాస్టిక్ ..లో డెన్సిటీ పాలిథిలిన్ ఉండటం వల్ల సాధారణ పరిస్థితుల్లో పేపర్ కప్పుల రీసైక్లింగ్ కష్టతరమవుతోంది. ప్రత్యేక పద్ధతులను అనుసరించాల్సి వస్తోంది.
సాధారణంగా పేపర్ కప్పులు హైడ్రోఫోబిక్ ఫిల్మ్ సన్నటి పొరతో తయారు చేస్తారు. కాగా ఇందులోనూ పాలీ ఇథలీన్ అంటే ప్లాస్టిక్ ఉంటుంది. వేడి ద్రవం పోసిన 15 నిమిషాల్లోపే ఈ మైక్రోప్లాస్టిక్ లేయర్‌లో చర్య జరుగుతుంది