Jyothi Gadda

చిక్కుడుతో ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోండి.. ప్రయోజనాలివే..!

05 March 2024

శీతాకాలంలో ఎక్కువగా చిక్కుడు కాయల పంట వస్తుంది. ఈ కాలంలో చిక్కుడు కాయను కూరగా చేసుకుని తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చని, మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయని నిపుణులు చెప్తుంటారు.

కణుపు చిక్కుడుకాయ రుచిలోనే కాదు మన శరీరానికి పోషకాలను అందించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. 

ముఖ్యంగా వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు హృద్రోగాలు, క్యాన్సర్లు వంటి వాటిని దూరం చేస్తాయి. చిక్కుడు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం, కొలస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి.

చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషదంలా పని చేస్తాయి. చిక్కుడుకాయలో సోలుబుల్ ఫైబర్ ఎక్కువ గా ఉంటుంది. బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తుంది.

ఈ కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్నీ నివారిస్తాయి. 

చిక్కుళ్ళలో ఉండే కాపర్ మెదడు ఆరోగ్యానికి కావాల్సిన డోపమైన్, గ్యాలాక్టోజ్‌, వంటి రసాయనాల విడుదలకు దోహదం చేస్తాయి. చిక్కుడు కాయలో సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 

ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి చిక్కుడు మంచి ఔషదంలా పని చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవాళ్లకీ చిక్కుడుకాయల్లో లభించే మాంగనీస్ ఆ సమస్యను తగ్గిస్తుంది. 

ఇది గుండె ఆరోగ్యాగానికి చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలకు రక్తం, ఎముకలలో బలం చాలా అవసరం. ఈ అవసరాన్ని కాల్షియం, ఐరన్ ఉన్న చిక్కుడు బాగా తీరుస్తుంది. నిద్రలేమితో బాధపడేవాళ్లకీ ఆ సమస్యను బాగా తగ్గిస్తుంది.