కళ్లు బాగా కనిపించాలంటే.. వీటిని తప్పక తినాల్సిందే..!
TV9 Telugu
03 January 2024
కంటి చూపు మెరుగుపరచడానికి ముఖ్యమైన విటమిన్లు ఆకు కూరల్లో పుష్కలంగా ఉంటాయి. కళ్ల ఆరోగ్యానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి, లుటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.
క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. విటమిన్ ఏ కంటిచూపునకు తోడ్పడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తుంది.
చిలగడదుంపలో విటమిన్ ఎ, విటమిన్ సి, లుటిన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.
బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది. బాదం తరచుగా తీసుకుంటే వయస్సు మీద పడటం వల్ల వచ్చే మచ్చల క్షీణత, కంటిశుక్లం సమస్యను నివారిస్తుంది.
గుడ్లలలో లుటిన్, జియాక్సంతిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇది వయస్సు-సంబంధిత దృష్టి లోపం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో విటమిన్ సి, ఇ, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి.
చేపలలో ఒమేగా -3 కొవ్వు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఇ లాగా, విటమిన్ సి అనేది యాంటీఆక్సిడెంట్, ఇది వయస్సు-సంబంధిత దృష్టి సమస్యలతో పోరాడుతుంది.
డార్క్ చాక్లెట్స్ లో కోకో అధికంగా ఉండటం వల్ల కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.