Ghee : చర్మ సంరక్షణ-నాజుకు నడుము కోసం.. నెయ్యిని ఇలా తినాలట..!
22 December 2023
నెయ్యి ఎక్కువగా తింటే బరువు పెరుగుతారని సాధారణంగా చెబుతారు. అయితే అది నిజం కాదు. స్వచ్ఛమైన నెయ్యిని సరైన మోతాదులో తీసుకుంటే బరువు తగ్గవచ్చు.
ఎనర్జీ డ్రింక్‌తో నెయ్యి తీసుకుంటే కొవ్వు తగ్గుతుంది. వేడి నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
నెయ్యి తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారడంతో పాటు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ ఎ లభిస్తుంది. గర్భిణులు నెయ్యి తింటే నెయ్యి గర్భస్థ పిండం ఎదుగుదలకు తోడ్పడుతుంది. కూరల్లో రసం, సాంబార్, పప్పులలో నెయ్యి వేస్తే మంచిది.
శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి నెయ్యి సహాయపడుతుంది. ఎప్పుడైనా చేతికి గాయం అయితే వెంటనే చేతికి నెయ్యి రాస్తే మంచిది. నెయ్యి రాయడం వల్ల త్వరగా గాయం తగ్గే అవకాశం ఉంటుంది.
నెయ్యిని తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. నెయ్యితో అరికాళ్లకు మసాజ్ చేస్తే కాళ్లనొప్పులు తగ్గుతాయి.
నెయ్యిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ బాగుపడటంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. నెయ్యి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ లభిస్తాయి.
ఆకలి మందగించిన వారు నెయ్యిని తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. నెయ్యి అల్సర్ సమస్యను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఉదయం కాఫీ, టీ తాగడం కంటే నెయ్యిని తీసుకుంటే మంచిది.