ఈ పండు కనిపిస్తే వెంటనే తినేయండి.. 

26 October 2023

ఊబకాయంతో బాధపడేవారికి వాటర్‌ యాపిల్‌ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

ఈ పండులో నీటి శాతం అధికంగా ఉండడంతో డీ హైడ్రేషన్‌కు చెక్‌ పెట్టొచ్చు. ఇందులోని గాలిక్ యాసిడ్, టానిన్లు, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరాన్ని ఫ్రీ రాడిల్స్‌ నుంచి రక్షిస్తాయి. 

షుగర్‌ పేషెంట్స్‌కి వాటర్ యాపిల్‌ మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ హైపెర్గ్లైసీమిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

వాటర్‌ యాపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది. అధిక రక్తపోటు సమస్యకు ఇలా సహజంగా చెక్‌ పెట్టొచ్చు. 

గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వాటర్‌ యాపిల్‌ను తీసుకోవాలి. ఇందులోని పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. 

వాటర్‌ యాపిల్‌లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడంలో విటమిన్‌ సీ కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది. 

ఇక వాటర్‌ యాపిల్‌ను ప్రతీరోజూ డైట్‌లో భాగం చేసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు కూడా దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. 

ఇక 100 గ్రాముల వాటర్‌ యాపిల్స్‌లో.. 93 గ్రాముల నీరు, 0.6 గ్రాముల ప్రొటీన్, 5.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.5 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటాయి.