యాలకులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో చిటికెడు యాలకుల పొడి, అల్లం కలిపి తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
రక్త ప్రసరణ వ్యవస్థలో యాలకులు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతీ రోజూ యాలకులను తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.
యాలకులను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. డయాబెటిస్‌తో బాధపడే వారికి యాలకులు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి.
నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారు నోటిలో యాలకులు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన సమస్యకు చెక్ పెట్టొచ్చు. యాలకుల పొడి నేచురల్ మౌత్ ఫ్రెష్‌నర్‌గా పనిచేస్తుంది.
బీపీ పేషెంట్స్‌కి కూడా యాలకులు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి. నిత్యం యాలకులను తీసుకోవడం వల్ల రక్తపోటు స్థిరంగా ఉంటుంది. ప్రతిరోజూ యాలకులు తీసుకుంటే బీపీ దరి చేరదు.
బరువు తగ్గాలనుకునే వారికి యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి. పాలలో చిటికెడు యాలకలు పొడి వేసుకొని తాగాలి. ఇలా క్రమంతప్పకుండా తాగితే శరీర మెటబాలిజమ్ రేటు వేగంగా పెరుగుతుంది.
డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కూడా యాలకుల పొడి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ రెండు యాలకులు తీసుకుంటే డిప్రెషన్ దూరమవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.