శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లేట్ చేయకండి..
31 December 2024
Ravi Kiran
విపరీతమైన అలసట, తరచూ జబ్బు పడటం, కండరాల నొప్పి, బలహీనత, వెన్నునొప్పి, ఎముకలు విరగడం.. ఆస్టియో పోరోసిస్, జుట్టు రాలడం, డిప్రెషన్, బరువు పెరగడం, అలర్జీ, ఎగ్జిమా..
దంతక్షయం, పుచ్చిపోవడం, చిగుళ్ల వ్యాధి, మూత్రనాళ వ్యాధులు, మూత్రాశయ వ్యాధి, రికెట్స్.. తరచుగా ఇలాంటి లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తే
విటమిన్ డి లోపం ఉన్నట్లేనని వైద్య నిపుణులు అంటున్నారు. ఆ విటమిన్ పుష్కలంగా దొరికే ఆహారం బాగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
విటమిన్ డీ ఆహారంలో కన్నా సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉదయం, సాయంత్రం పడే ఎండలో వాకింగ్, ఎక్సర్‌సైజులు చేయాలనీ వైద్యుల సూచన.
సాల్మన్, సార్డ్తెన్స్, హెర్రింగ్, మాకెరెల్ వంటి చేప నూనెలో బాగా దొరుకుతుంది. రెడ్ మీట్, లివర్, కోడిగుడ్డు సొన, కొన్ని తృణధన్యాల్లోనూ లభిస్తుంది.
అలాగే వైద్యులు, న్యూట్రిషనిస్టుల సూచన మేరకు విటమిన్ డీ సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇక పైన పేర్కొన్నది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే.. ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి.