వీరికి చపాతీలు విషంతో సమానం.. అస్సలు తినకూడదు

30 October 2024

Ravi Kiran

పొట్ట తగ్గించుకోవాలని చూసేవారు చపాతీలను ఎక్కువగా తీసుకుంటుంటారు. క్రమం తప్పకుండా తీసుకుంటే వెయిట్ తగ్గుతుందని వారి అంచనా.. కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చపాతీ తినకూడదట.

డయాబెటిస్ ఉన్నవారు అన్నానికి బదులు చపాతీలు ఎక్కువగా తింటుంటారు. కానీ వారు అస్సలు తినకూడదు. చపాతీలో అమిలోపెక్టిన్ అనే స్టార్చ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడూ అలసిపోతూ ఉండేవారు చపాతీ తినకపోవడమే మంచిది. ఎందుకంటే గోధుమలలోని కార్బోహైడ్రేట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల అలసట, నీరసం మరింత పెరుగుతాయి.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు చపాతీ తినకూడదు. ఎందుకంటే గోధుమలలో గ్లూటెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. 

బరువు తగ్గించుకోవడానికి చాలామంది అన్నం మానేసి చపాతీ తింటారు. అయితే గోధుమల్లో ఉండే గ్లూటెన్‌లోని కార్బోహైడ్రేట్లు శరీరంలో కొవ్వును నిల్వ చేయడానికి కారణమవుతాయి. ఇది సులభంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. 

చపాతీ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే, గోధుమలలోని గ్లూటెన్ పేగులలో మంటను కలిగిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది.