ఈ ఫుడ్స్ తింటే ఎక్కువ రోజులు బతుకుతారట.. 

07 January 2025

Ravi Kiran

 మారుతున్న కాలానుగుణంగా.. మన లైఫ్‌స్టైల్‌లోనూ చాలా మార్పులు వస్తున్నాయి. అలాగే సమయానికి పౌష్టికాహారం అందకపోవడంతో.. ఈకాలంలో చిన్న వయస్సులోనే లేనిపోని రోగాలు దరి చేరుతున్నాయి.

అందుకే వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లు తినాలని సూచిస్తున్నారు. దీని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతున్నాయని చెబుతున్నారు.  

ఏది తిన్నా మితంగా తినాలంటారు పెద్దలు. అదే నిజం.! ఆకలేసిందని ఒకేసారి ఎక్కువగా తినడం కాకుండా.. ఎక్కువసార్లు తిన్నా సరే.. కొంచెం కొంచెం తినాలని వైద్యులు చెబుతున్నారు.  

 లంచ్‌లో పెరుగు లేకపోతే మనకు వెలితిగా ఉంటుంది. అలాగే పెరుగు కూడా మన జీర్ణవ్యవస్థను రక్షించడంలో దోహదపడుతుంది. పెరుగు లేదా మజ్జిగ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను తయారు చేస్తాయి 

ఇక నాన్ వెజ్ విషయానికొస్తే.. చికెన్, మటన్ బదులుగా చేపలు ఎక్కువగా తినాలని డాక్టర్లు చెబుతున్నారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల.. అవి మన కంటిచూపును మెరుగుపరుస్తాయి.  

ఈ మధ్యకాలంలో చాలామందికి బీపీ, షుగర్ వ్యాధులు యవ్వనంలోనే వచ్చేస్తున్నాయి. ఈ దీర్ఘకాలిక రోగాలను కచ్చితంగా అదుపు చేసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.  

చక్కెర, ఉప్పు తగ్గించడమే కాదు.. మీ డైట్‌లోనూ పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలని.. అప్పుడే షుగర్, బీపీలకు దూరంగా ఉంటారని వైద్య నిపుణులు తెలిపారు 

తినడమే కాదు.. దానికి తగ్గట్టుగా శరీరానికి కావల్సినంత శ్రమను కూడా అందజేస్తేనే మనం ఎనర్జీతో ఉంటాం. అందుకే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.