ఎసిడిటీకి వంటింటి చిట్కాలు.. 

23 November 2023

ఎసిడిటీతో బాధపడేవారు ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కడుపులో నొప్పి ఎక్కువైతే ఇలా చేయాలి. 

ఇక ఎసిడిటీకి చెక్‌ పెట్టడంలో అల్లం కూడా దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. భోజనం చేసే ముందు.. అల్లాన్ని చిన్న చిన్న ముక్కులగా చేసుకొని తీసుకోవాలి.

వెల్లుల్లి కూడా ఎసిడిటీని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పచ్చి వెల్లుల్లిని అప్పుడప్పుడు తీసుకుంటే ఎసిడిటీ సమస్య నుంచి బయటపడొచ్చు. 

దాల్చిన చెక్కతో కూడా ఎసిడిటీని తగ్గించుకోవచ్చు. దాల్చిన చెక్కను నీళ్లలో వేసుకొని మరిగించి దానిని తాగితే ఎసిడటీ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. 

వాము కూడా ఎసిడిటీని దూరం చేసేందుకు ఉపయోగపడుతుంది. గుప్పెడు వాము తీసుకొని అందులో కొంత ఉప్పవేసి నోట్లో వేసుకోవాలి. అనంతరం సరిపడ నీరు తాగితే ఎసిడిటీ సమస్యను తగ్గించుకోవచ్చు. 

ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున నాలుగైదు పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకొని తాగితే ఎసిడిటీ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇలా క్రమంత్పకుండా చేస్తే ఫలితం ఉంటుంది. 

ఇక కొబ్బరి నీళ్లు తాగినా ఎసిడిటీ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఎసిడిటీ సమస్య వేధిస్తుంటే.. భోజనం చేసిన 20 నిమిషాల తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.